మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశాలు
హైదరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): సోషల్ మీడియాను వినియోగించే వారందరూ బాధ్యతతో వ్యవహరించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ శారద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాను చెడు మార్గంలో వినియో గించే వారిని నియంత్రించడమే లక్ష్యంగా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సోషల్ మీడియా లో తండ్రి కూతుర్ల వీడియోపై వచ్చి న అభ్యంతరకర పోస్టులపై నేరెళ్ల శారద స్పందించారు. తెలంగాణలో ని మహిళల హక్కులను, వారికి రక్ష ణ కల్పించాల్సిన బాధ్యత మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా తనపై ఉంద ని స్పష్టంచేశారు. సోషల్‌మీడియా ను వినియోగించే కంటెంట్ క్రియేట ర్స్, ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.