calender_icon.png 4 April, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారా లీగల్ వాలంటీర్ల బాధ్యతలు కీలకం

03-04-2025 03:02:18 PM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి 

కొత్తగూడెం (విజయ క్రాంతి): పారాలీగల్ వాలంటీర్లతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  జి.భానుమతి గురువారం సమీక్ష సమావేశంను నిర్వహించారు. మార్చి నెలకు సంబంధించి పారా లీగల్ వాలంటీర్స్ నిర్వహించిన కార్యక్రమాల వివరాలను అడిగి  తెలుసుకున్నారు.ఈ సందర్భంగ న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో పారా లీగల్ వాలంటీర్ల బాధ్యత కీలకమని, న్యాయాన్ని మరింత చేరువ చేయడం కోసం  తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని తెలిపారు.

కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పిల్లల ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలను, మానసిక వికాస కేంద్రాలలో క్లినిక్ ను ఏర్పాటు చేసి పారా లీగల్ వాలీంటర్లు అక్కడ సందర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పాటుపడాలన్నారు. ఏదైనా న్యాయ సంబంధ అంశాలను ఉన్నట్లయితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కొత్తగూడెం వారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు.పారా లీగల్ వాలంటీర్స్ ప్రజలకు వారధిగా పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.