కోనరావుపేట, జనవరి2 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులకు దూరంగా ఉంటామని మండల వైద్యాధికారి వేణు అన్నారు. మండల కేంద్రంలో కాలనీ వాసులు విష జ్వరాల, డెంగ్యూ బారిన పడుతున్న కాలనీలో ఇంటింటా తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు.
భయపెడు తున్న డెంగ్యూ అనే అనే శీర్షికన విజయ క్రాంతిలో ప్రచురితం కావడంతో జిల్లా కలెక్ట ర్ ఆదేశాల మేరకు కాలనీకి వైద్య బృందం కదిలి వచ్చింది. ఈ సందర్భంగా మండల వై ద్యాధికారి వేణు మాట్లాడుతూ జ్వర పీడితు లను గుర్తించి వారి నుంచి రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించమన్నారు.. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంటింటా దో మల నివారణకు స్ప్రే చేయించారని అన్నారు
దోమలు వృద్ధి చెందే కారకాలు ఏమున్న వాటిని తొలగించాలని అన్నారు. ముఖ్యంగా ఎక్కువ రోజుల నుంచి నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు. ఇంటి ముందర గుంటల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతుందని, అనారోగ్యంతో బాధ పడే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయిం చుకోవాలన్నారు. సూపర్ వైజర్ రశీద్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లున్నారు.