calender_icon.png 8 February, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ మేళాకు స్పందన

08-02-2025 01:15:45 AM

కరీంనగర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్స్, నాలెడ్జ్ సెంటర్, మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన లభించింది. యాక్సిక్ బ్యాంకు, వెంకటేశ్వర అసోసియేట్స్, రిలయన్స్ నిప్సో లైఫ్ ఇన్స్యూరెన్స్, పీఎస్ సొల్యూషన్స్, బీజెడ్ ఫిన్ సర్వీసెస్ లిమిటెడ్, కనెక్ట్ క్యూ, కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు హాజరై ఇంటర్వులు నిర్వహించగా, 400 మందికిపైగా అభ్యర్థులు పాల్గొన్నారు.

ఎంపికైన వారికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి వరలక్ష్మీ, టీఎస్ కేసి కో ఆర్డినేటర్ డాక్టర్ డి శ్రీనివాస్ నియాచుక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం కల్పన, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎన్ మనోజ్ కుమార్, టీఎస్ కేసి ఎఫ్ టి యం జి రాజశేఖర్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొని ఉద్యోగం పొందిన విద్యార్థులను అభినందించారు.