29-04-2025 04:23:11 PM
ముత్తారం (విజయక్రాంతి): ఓడేడులో గౌడ సంఘం ఉచిత మెగా వైద్య శిబిరానికి స్పందన భారీ స్పందన వచ్చింది. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి(Medicover Hospital) ఆధ్వర్యంలో మంగళవారం ఓడేడ్ గ్రామంలో గౌడ సంఘం వారికి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిభిరాన్ని గౌడ సంఘం నాయకులు ప్రారంభించారు. ఈ శిబిరంలో 120 మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దీక్షిత్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేశారు.
ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ... గౌడ సంఘం వాల్లతో పాటు మారుమూల గ్రామీణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో దాసరి చంద్రమౌళిగౌడ్, అల్లాడి యాదగిరిరావు, చేరాల వెంకటేష్, గౌడశెట్టి సత్తయ్య, కె.సన్ని, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.