14-04-2025 12:22:38 AM
చొప్పదండి, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): రామడుగు మండలం గోపాల్రావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంజీవనీ హాస్పిటల్, సంజీవనీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ విజయలక్ష్మి అధ్వార్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన లభించింది.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా పిల్లల వైద్యు నిపుణులు డాక్టర్ రవికాంత్, వైద్యులు సంధ్య, నివేదిత, నాగరాజుల నేతృత్వంలో రక్త, మూత్ర, ఈసీజీ, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 470 మందికి పైగా పరీక్షలు చేసి ఉచితముగా మందులు పంపిణి చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గ్రామ మాజీ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న శిబిరం సందర్శించి పరీక్షలు చేయించుకున్నారు... కార్యక్ర మంలో వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.