calender_icon.png 6 February, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుపై వెంటనే స్పందించాలి

06-02-2025 12:00:00 AM

జిల్లా ఎస్పీ సింధు శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితు లకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధులు నిర్వహించాలన్నారు.

ప్రజా సమస్యల పైన వెంటనే స్పందించి బాధితు లకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఐళ్లను పరిశీలించారు కేసులు ఫైళ్ళు పెండింగ్లో ఉండకుండా చూడాలన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసుల నమోదు శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనం తరం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళా కానిస్టేబుల్ లకు పిటిషన్ మేనేజ్మెంట్ ఎంట్రీ చేసిన డా టా ను తనిఖీ చేశారు.

పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5 ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు ఫైల్స్ క్రమ పద్ధతిలో నిర్దేశిత ప్రదేశాలలో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించా లన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాస్లు ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఎస్సై మల్లారెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ 

పోలీస్ స్టేషన్ పరిధిలో విసిబుల్ పోలీసింగ్ ఉండాలని, ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని , ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని జిల్లా ఎస్పి  సింధుశర్మ  ఐపిఎస్ సూచించారు.

ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పి సింధుశర్మ  ఐపిఎస్ సూచించారు.  ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పిం చాలని తెలిపారు.

ఈ సందర్భంగా  పెండింగ్ లో ఉన్న కేసుల గురించి, మరియు  పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ  చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ల  పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ను పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటా ను తనిఖీ చేశారు. రిసెప్షన్‌ఈస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్  మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచిం చారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండే టట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.

రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్నివిభాగాలు  తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు. సైబర్ నేరాల బారిన పడకుండా పరిధి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన పెంచాలన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలన ఆక్సిడెంట్ జోన్ లుగా,  బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు. 

అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ..., ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి  తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సై మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు