04-03-2025 01:38:14 AM
ప్రజలకు పడితే తగలకుండా సలహాలు సూచనలు చెప్పండి
ఇంటర్ పరీక్షలకు పటిష్ట చర్యలు తీసుకోండి
అధికారులతో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ మార్చి 3 (విజయ క్రాంతి) : ప్రతి ఫిర్యాదు కు సవిధానంగా అధికారులు ప్రజలకు సమాధానాలు చెప్పాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులతో వేసవి తీవ్రత, ఇంటర్ పరీక్షలపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా,త్రాగు నీటి సరఫరా పై దృష్టి సారించాలని కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులకు సూచించారు.
ఐసిడిఎస్ ,ఇతర శాఖలలో ఎండలో ఎక్కువగా పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ,వడదెబ్బకు గురైన వారు తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ ను సంప్రదించాలని, సరైన సలహాలు తీసుకోవాలని సూచించారు. మార్చి 5 నుండి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆమె తెలిపారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను 22483 మంది విద్యార్థులు రాయనుండగా, పదవ తరగతి పరీక్షలను 13,038 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారని తెలిపారు. ఇంటర్ పరీక్షల కోసం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పదవ తరగతి పరీక్షలకు 60 పరీక్ష కేంద్రాలు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో సమితి అధికారులు ఉన్నారు.