calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

12-04-2025 12:00:00 AM

సీపీ అంబర్ కిషోర్ ఝా

బెల్లంపల్లి, ఏప్రిల్ 11: ప్రజా ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. శుక్రవా రం బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే ఫిర్యాదులను తెలుసుకున్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ విష యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ ఏ. రవికుమార్, బెల్లంపల్లి రూరల్, తాండూ ర్ సీఐలు ఆఫ్జలుద్ధిన్, కుమారస్వామి, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కె.మహేందర్‌లతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.