26-04-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీంఆసిఫాబాద్,ఏప్రిల్ 25 (విజయక్రాంతి): విద్యతోనే గౌరవం దక్కుతుందని ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో రాంటెంకి సుధాకర్ ర్యాం కు సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. యు పి ఎస్ సి విడుదల చేసిన ఫలితాలలో 949 ర్యాంకు సాధించిన సుధాకర్ తల్లిదండ్రులు రాంటెంకి లలిత, సోమయ్య లను జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి కౌటాల మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవనంలో సన్మానిం చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామం బాదంపల్లి నుండి రాంటెంకి సుధాకర్ యుపిఎస్‌సిలో 949 ర్యాంకు సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుద్దాల దేవయ్య, మండల సమస్య సభ్యులు పాల్గొన్నారు.