*బంగ్లా దాడులపై స్పందన నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఇద్దరు భారత సంతతి వ్యక్తులకిచ్చిన గౌరవాలను బ్రిటన్ రాజు చార్లెస్ వెనక్కి తీసుకున్నారు. గతంలో రమీందర్ సింగ్ రజా( రమీరేంజర్) అనే భారత సంతతి వ్యక్తికి కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గౌరవాన్ని ఇచ్చారు. అనిల్ కుమార్ భానోత్ అనే మరోవ్యక్తి కూడా ఆఫీసర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే గౌరవాన్ని పొందారు. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులను వీరు ఖండించిన నేపథ్యంలో వారి గౌరవాలకు భంగం కలిగిందని భావించిన బ్రిటన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ రాజు తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి.