calender_icon.png 13 March, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పాలి

13-03-2025 02:12:18 AM

మంత్రి ధనసరి అనసూయ సీతక్క

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): పిల్లలను బడిలో చేర్పినప్పడి నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పాలని గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ‘ప్రమోటింగ్ వుమెన్ రైట్స్, జండర్ ఈక్వాలిటీ, ఫాస్టరింగ్ ఎంపవర్‌మెంట్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీ కాశీం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యారంగంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజ  రంగాల్లో కీలకంగా పని చేయాలని సూచించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణి కుముదుని మాట్లాడుతూ మగవారితో పోలిస్తే మహిళలకు విజ  సాధించడంలో అనేక ఆటంకాలు వస్తాయన్నారు. వాటిని ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్ మొలుగారం, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ.శ్రీరాం వెం  ఓయూ అధికారులు ప్రొ.  పాల్గొన్నారు.