తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ ఐజీ రాజేశ్
కాప్రా, నవంబర్ 22: తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ, ప్రభుత్వం కల్పిస్తున్న వనరులను.. జైలు సిబ్బంది, అధికారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర జైళ్లశాఖ ఐజీ వై.రాజేశ్ పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో శుక్రవారం జైలు సిబ్బంది, అధికారుల పునరుశ్ఛరణ కార్యక్రమ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
జైలు సిబ్బంది, అధికారులు అంకితభావంతో పనిచేసి జైళ్లశాఖకు గుర్తింపు తీసుకురావాలని అన్నారు. సిబ్బందిని ఆరు గ్రూప్‌లుగా విభజించి వారితో చర్చించి వారి సూచనలు, సౌకర్యాల కల్పనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీ శ్రీనివాస్, ప్రముఖ వక్త నళి, చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం సూపరింటిండెంట్ సమ్మయ్య, చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ రామచంద్రం, డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు పాల్గొన్నారు.