- రిసెప్షనిస్టుకు గాయాలు .. ఇద్దరు కానిస్టేబుళ్ల దాష్టీకం
హిమాచల్‌ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
సిమ్లా, జనవరి 2: మద్యం, ఫుడ్ ఇవ్వలేదని ఇద్దరు కానిస్టేబుళ్లు రిసార్ట్ మేనేజర్‌ను హత్య చేశారు. రిసెప్షనిస్టుపై దాడి చేసి గాయపరిచా రు. మంగళవారం రాత్రి ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. బనిఖేత్ లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో న్యూఇయర్ పార్టీ జరుగుతున్నది. కొన్నిగంటల తర్వాత అమిత్, అనూప్ అనే కానిస్టేబుళ్లు రిసార్ట్‌కు వచ్చారు. సార్ట్ సిబ్బందిని మద్యం, ఫుడ్ డిమాండ్ చేశారు.
అందుకు రిసెప్షనిస్టు సచిన్ నో చెప్పాడు. దీంతో కానిస్టేబుళ్లు రెచ్చిపోయి దాడికి దిగారు. ఈ క్రమంలో రిసార్ట్ మేనేజర్ రాజిందర్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుళ్లు మరింత రెచ్చిపోయి సచిన్, రాజిందర్‌పై దాడి చేశారు. రిసార్ట్ సిబ్బంది వెంటనే రాజిందర్, సచిన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాజిందర్ మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కానిస్టేబుళ్లు అనూప్, అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.