calender_icon.png 14 February, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జేఈఈ’లో ‘రెసోనెన్స్’ విజయదుందుభి

13-02-2025 01:55:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్ ఫలితా ల్లో రెసోనెన్స్ విద్యార్థులు విజయదుందుభి మొగించారు. రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (తెలంగాణ, ఏపీ) డైరెక్టర్ పూర్ణ చంద్రరావు విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మాదాపూర్ రెసోనెన్స్ జూనియర్ కళాశాలలో బుధవారం సన్మానించారు.

జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ వన్ ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో పలు సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్ సాధించారన్నారు. హైదరాబాద్ విద్యార్థులలో 53 మంది 99 పర్సంటైల్, 265 మం ది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో 99 పర్సంటైల్ స్కోర్ చేశారన్నారు.

వేదాంత్ (99.94), హరితేజ్ (99.92)తో హైదరాబాద్ టాపర్లుగా నిలిచారు. పల్లా శివసంకేత్‌రెడ్డి (99. 87), పీ వెన్నెల (99.72), అవనీశ్ నితిన్ (99.71), బింగి శ్రీహర్ష (99..69), పీ దివిత్ రెడ్డి (99.65), సిద్దార్థ్ రాఘవ (99.56), క్షితి జ్ జైన్ (99.56), ప్రణయ్ వెంకటేష్ (99. 51) ర్యాంకులు సాధించినట్టు తెలిపారు.