calender_icon.png 23 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తా చాటిన ‘రెజొనెన్స్’

23-04-2025 01:17:39 AM

హనుమకొండ, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఇంటర్ ఫలితాల్లో నగరంలోని రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీ, బైపిసీ విభాగంలో 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు కైవసం చేసుకున్నారు.

నలుగురు విద్యార్థులు 468/470 మార్కులతో రాష్ట్ర ప్రథమ ర్యాంకు, 22 మంది 467/470 తో రెండో ర్యాంక్, 21 మంది తృతీయ ర్యాంక్, 25 మంది నాలుగో ర్యాంక్ సాధించారని కాలేజి చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరం భూక్యా మనోజ్ కుమార్, వేముల అనిక్షిత, గందే వర్ష, మంథని సహస్ర రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం సాధించారని వివరించారు.

బైపిసీ మొదటి సంవత్సరం గండ్ర శ్రీజ, చాపర్తి శ్రీనిధి, దర్ముల శ్రీతిక రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం సాధించారని పేర్కొన్నారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం నీలం నీక్షిత 995/1000, బుర్ర అక్షిత 994/1000 సాధించారని తెలిపారు. బైపీసీ ద్వితీయ సంవత్సరం లో యం పూజశ్రీ 992/1000, ఆర్ ఇక్షవర్ 992/1000, డీ త్రిలోచన్ 992/1000, యం అస్మిత 992/1000 సాధించారని చెప్పారు.ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్, సిబ్బంది అభినందించారు.