10-03-2025 04:56:58 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన పరిధిలో స్వీకరించారు. ప్రజలు చెప్పే సమస్యను ఓపికగా విన్న కలెక్టర్ వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 30 అర్జీలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్ఓ రత్న కళ్యాణి, అధికారులు పాల్గొన్నారు.