నిర్మల్ (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖలకు అందించి వాటిని పరిష్కరించాలని సూచించారు. మొత్తం 22 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ అధికారులు పాల్గొన్నారు.