calender_icon.png 27 December, 2024 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా అర్జీలను పరిష్కరించండి

02-12-2024 07:21:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టరేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదన కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన అర్జీలను స్వీకరించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రజలు ఏ సమస్యతో వచ్చిన వాటిని పరిష్కరించవలసిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.