25-03-2025 01:12:57 AM
అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 24 (విజయక్రాంతి): ప్రజావా ణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిం చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సంబంధిత అధికారులను ఆదే శించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు....జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో నివాసం ఉంటున్న గుగులోతు వీరు s/o బాలు సాయిరాం తండాలో పూరి గుడిస నివాసం ఉంటున్నామని, ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయం సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన నివాసముంటున్న పూరీలు పూర్తిగా దగ్ధం అయిందని సర్వం బూడిద పాలు అయిందని తమ కుమార్తె వివాహం కోసం దాచుకున్న నగదు బంగారం మొత్తం కానీ బూడిద అయినయని, కేవలం కట్టు బట్టలు మాత్రమే మిగిలాయని కావున తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయవలసిందిగా చేసిన దరఖాస్తులు పరిశీలించి తగు చర్యలు నిమిత్తం హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు.
* ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామంలో నివాసం ఉంటున్న కున్సోత్ అరుణ w/o భూక్య నరేష్ తమకు ఒడ్డుగూడెం గ్రామంలో3.10 ఎకరాల పోడు భూమి ఉందని, దానిలో 1. 32 గంటలకు గాను పట్టా వచ్చిందని మిగతా భూమికి పట్టా రాలేదని, ఆ భూమిని ఆ ప్రక్కన ఉంటున్న భూక్యా పులి సింగ్ అనే వ్యక్తి తన భార్య భూక్య సరోజా పేరు మీద పట్టా చేపించుకున్నారని కావున విచారణ జరిపి తమ భూమి పట్టా తమకు ఇప్పించాలని చేసిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు నిమిత్తం టేకులపల్లి తాసిల్దార్ కు ఎండాఫ్ చేయడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు