నిర్మల్ (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్ఓ రత్న కళ్యాణి, అధికారులు ఉన్నారు.