calender_icon.png 11 January, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమ్మెను పరిష్కరించండి

31-12-2024 06:38:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ అన్నారు. మంగళవారం నిర్మల్ లో ఆయన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు 21 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు పాఠం జరగక భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, పిడిఎఫ్ నాయకులు ఉన్నారు.