calender_icon.png 22 December, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం

22-12-2024 02:37:34 AM

కరీంనగర్, డిసెంబరు 21 (విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ లో ఐదు గ్రామాలు,  ఒక మున్సిపాలిటీ ని రాష్ర్ట ప్రభుత్వం విలీనం చేసే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ పాలకవర్గం సభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది  జరిగిందని మేయర్ యాదగిరి స కరీంనగర్ నగరపాలక సంస్థ సాధరణ సర్వ సభ్య సమావేశం శనివారం ప్రశాంతంగా జరిగింది.

నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు అధ్యక్షతన, కమీషనర్ చాహాత్‌బాజ్ పాయ్ సమక్షంలో  జరిగిన ఈ సమావేశంలో పలు ఎజెండా అంశాలపై పాలకవర్గ సభ్యులు ఏకగ్రీ వంగా ఆమోదం తెలిపారు.  ప్రశ్నోత్తరాల సమయంలో పాలకవర్గ సభ్యులు డివిజన్ వారిగా ప్రజా సమస్యలు అభివద్ధి అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు. పలు పెండింగ్ అభివద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యసను సభ దష్టికి తెచ్చారు.

సభ దష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... రాష్ర్ట ప్రభుత్వం చట్ట సభలో చేసిన విలీన గ్రామాల అంశం పై పునరాలోచన చేసి...దాన్ని విరమించుకోవాలని సభలో ఏకగ్రీవంగా పాలకవర్గ సభ్యులు తీర్మాణం చేశారని తెలిపారు.

గతంలో కలిసిన 8 గ్రామాల విలీనం తో నగరపాలక సంస్థ విస్తీర్ణం 65 పెరిగింది కాబట్టి మల్లీ 6 గ్రామాలను విలీనం చేస్తే 150 కి. మీ విస్తీర్ణం పెరిగి ప్రజలకు ఇబ్బందులు వస్తాయని తెలిపారు. నగరపాలక సంస్థ లో అభివద్ధి కి సరైన నిధులు లేక...గతంలో విలీనం చెందిన 8 గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేక పోతున్నామని....

శివారు గ్రామాల విలీనం తో ప్రజలకు అన్యాయం జరగడంతో పాటు నగరపాలక సంస్థ మీద భారం పెరుగుతుందని సభ్యులు కోరినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ ప్రస్తుతం ఆర్థికంగా భారంను మోసే పరిస్థితి లో లేదని... రాష్ర్ట ప్రభుత్వం పాజిటివ్ దక్పథం తో ఆలోచన చేసి... చట్ట సభలో చేసిన తీర్మాణంను విరమించుకొని... రద్దు చేయాలని పాలకవర్గం కోరినట్లు తెలిపారు.

సభలో సభ్యులు తీర్మాణం చేసి రిజల్యూషన్ కాఫీని జిల్లా పాలనాధికారి ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ నగరానికి చాలా దూరంగా ఉండటం దుర్షెడ్, బొమ్మకల్  వ్యవసాయాధారిత గ్రామాలు చాలా దూరంగా ఉన్నాయని తెలిపారు. వీటిని కలపడం ద్వారా నగరపాలక సంస్థ కు భారం పెరిగి చాలా ఇబ్బందులు వస్తాయని తెలిపారు.

రాష్ర్ట ప్రభుత్వం  ఆ ప్రాంతాలను అభివద్ధి చేయాలను కుంటే  బొమ్మకల్, గోపాల్ పూర్, దుర్శెడ్ ను ఒక మున్సిపాలిటీ చేయాలని, చింతకుంట, మల్కాపూర్ గ్రామాలను ఒక మున్సిపాలిటీ చేయొచ్చని తెలిపారు. దీని వల్ల ఆ ప్రాంతాల ప్రజలకు వెసులు బాటు దొరుకుతూ... అభివద్ధి చేసేందుకు సులభతరంగా ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే గతంలో విలీనం చెందిన 8 గ్రామాల్లొ పూర్తి స్థాయిలో అభివద్ధి కి నోచుకోలేవని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులు, సీఎం అస్యూరెన్స్ నిధులు రావడంతో కొంత వరకు అభివద్ధి పనులు చేశామని తెలిపారు. ఇప్పుడు స్మార్ట్ సిటీ, సీఎం అస్యూరెన్స్ నిధులు కూడ అయిపోయిన పరిస్థితి ఉందని తెలిపారు. నగరపాలక సంస్థ సాధరణ నిధులతో  అభివద్ధి పనులు చేయడం చాలా బారం అన్నారు.

సర్వ సభ్య సమావేశంలో 5 గంటల పాటు ప్రతి ప్రజా సమస్య పై సూదీర్గంగా చర్చ చేసి... సమస్యల పరిష్కారం కోసం తగిన నిర్ణయాలు తీస్కున్నామని తెలిపారు. పారిశుధ్యంతో పాటు లైటింగ్, పెండింగ్ అభివద్ధి కార్యక్రమాల పై సభలో చర్చించామని తెలిపారు. పాలకవర్గ సభ్యులు సభ దష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలకు కావల్సిన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీస్కుంటున్నామని స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన సీఎం అస్యూరెన్స్ అభివద్ధి పనులను కూడ ఈ వారంలో ప్రారంభం చేసి పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. అమత్ 2 లో విలీన గ్రామాల్లో 144 కోట్లతో చేపట్టిన మంచి నీటి సరఫరా పైపు లైన్ పనులు కూడ కొనసాగుతున్నాయని తెలిపారు.

వాటి పనులు పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే ప్రతి రోజు మంచి నీరు సరఫరా చేస్తామన్నారు. సీజన్ ప్రారంభం అయింది కాబట్టి దోమల నివారణ చర్యలో భాగంగా డివిజన్ వారిగా ఫాగింగ్ చేసేందుకు సరైన టైం లైన్ నిర్ణయించి ఫాగింగ్ పనులు చేపట్టాలని పారిశుధ్య అధికారి అసిస్టెంట్ కమీషనర్ కు ఆదేశించినట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో మరో రెండు సర్వ సభ్య సమావేశాలు ఉంటాయని ఆ సమావేశాల్లో కూడా మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిపై కూడ చర్చించి మమ్ము గెలిపించిన ప్రజలకు సేవలందిస్తామని తెలిపారు. సభలో  ప్రజా సమస్యలు, అభివద్ధి పనుల పే చర్చించిన పాలకవర్గ సభ్యులందరికి హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.