calender_icon.png 26 April, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో భూ వివాదాలకు పరిష్కారం

25-04-2025 01:06:09 AM

ధరణిలో తప్పులున్నాయని 30 లక్షల పిటిషన్లు వచ్చినయ్

ఇప్పటి నుంచి గెట్టు పంచాయితీలు ఉండవు

మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఏప్రిల్ 24 : రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూ పేందుకు ప్రభుత్వం నూతనంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అ న్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్,  అక్కన్నపేట మండలకేంద్రా ల్లో  భూ భారతి చట్టం - 2025 పై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు.  భూ మి అంటే ఆత్మగౌరవమని, అలాంటి భూమి వివాదాల్లో ఉండడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. గతంలో ధరణి ద్వారా అనేక మంది రైతులు నష్టపోయారని, సుమారు 30 లక్షల మంది తమ భూ సమస్యలపై ఫిర్యాదులు చేశారన్నారు.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, దీని ద్వారా భూమి కొనుగోలు, అమ్మకాలు పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. ‘గతం లో భూముల వివరాలు గ్రామాల వారిగా ఉండేవి. పెద్దలు హద్దులతో సహా చెప్పేవా రు. అప్పట్లో మాటకు అంత విలువ ఉండేది. సాదా కాగితాలపై రాసుకున్నవే పత్రాలుగా చెల్లుబాటు అయ్యేవి. కానీ, భూముల విలు వ పెరిగిన తర్వాత ఒకే భూమిని ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అన్నదమ్ముల మధ్య పంచాయతీలు, భూముల వివాదాలు పెరిగాయి‘ అని అన్నారు.

30 ఏండ్ల కిందట అ మ్మిన భూమి ధరణి లో మళ్లీ పాత యజమాని పేరు వచ్చింది. పంచాయితీలు గొడవ లు అయ్యాయి. భూమి ట్రాన్జెక్షన్స్ పారదర్శకంగా ఉండేలా చట్టం తెచ్చాం. సొంత కు టుంబాల్లోనే భూ పంచాయతీలు అవుతున్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మం చిది కాదు. అలాంటివి ఉంటే జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయండి. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలి. వాటిని అభివృద్ధికి వాడుకోవాలి. కబ్జాలు చేసుకుంటూ పోతే భవిష్యత్ లో శ్మశాన వాటికకు కూడా భూములు దొరకవు. త్వరలోనే గౌరవెల్లి కాలువల నిర్మాణం పూర్తవుతుంది.

ప్రాజెక్టు ద్వారా నీళ్లు అంది స్తాం. కొంత మంది రైతులకు నష్టం జరిగినా వారిని ఆదుకుంటాం. ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగింది. అలాంటి తప్పు జరగదనే భూ భారతి వచ్చింది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నం’ అని మం త్రి అన్నారు. ఈ సదస్సులో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.