calender_icon.png 17 November, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల్దీవుల మంత్రుల రాజీనామా

12-09-2024 02:34:41 AM

  1. గతంలో మోదీపై నోరు జారిన మినిస్టర్లు 
  2. ముయిజ్జు పర్యటనకు ముందు కీలక పరిణామం

మాల్దీవులు, సెప్టెంబర్ 11: భారత్‌తో సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దిద్దుబాటు చర్యలకు చేపడుతున్నారు. త్వరలోనే ఆయన ఢిల్లీకి రానున్న ట్లు ప్రకటించిన కొద్దిసేపటి ముందే ప్రధానిమోదీపై నోరు జారిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. గతంలో ఈ ఇద్దరు వీరిని క్యాబినెట్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇక ముయుజ్జు పర్యటన షెడ్యూల్ ఇరు దేశాల అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మాల్దీవుల ప్రభుత్వం తెలిపింది. 2023 నవంబర్‌లో ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు.

అప్పటినుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి ముయిజ్జు హాజరుకావడంతో మాల్దీవుల వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. గతనెలలోనూ విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవుల్లో పర్యటించారు. ముయిజ్జుతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో సమావేశమయ్యారు.