calender_icon.png 10 October, 2024 | 12:51 PM

60 మంది వైద్యుల రాజీనామా

10-10-2024 01:16:00 AM

కోల్‌కతా బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్

దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువ

కోల్‌కతా, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా సం చలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనలో న్యాయం కోసం డాక్టర్లు రాజీనామాలు చేస్తున్నారు. మృతురాలికి న్యాయం జరగాలంటూ జూనియర్ డాక్టర్లు నిరహార దీక్ష చేస్తున్నారు. వీరికి మద్దతుగా తాజాగా మెడికల్ కాలేజీకి చెందిన 60 మంది సీనియర్ వైద్యులు తమ పదవులకు రాజీనా మాలు సమర్పించారు.

మంగళవారం ఆర్జీకర్ హాస్పిటల్‌కు చెందిన 50 మంది సీని యర్ డాక్టర్లు, టీచింగ్ సిబ్బంది రిజైన్  చేసి న సంగతి తెలిసిందే. డాక్టర్ల రాజీనామాతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. న్యాయం కోసం సీఎం మమతాబెనర్జీతో చర్చలు జరి పినా ఫలితం లేదని ఏడుగురు ట్రైనీ డాక్టర్స్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.  వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా వైద్యులు దీక్షల్లో పాల్గొన్నారు.

ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, గురుతేజ్ బహదూర్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు బ్లాక్ రిబ్బన్లు ధరించి ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టా రు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ క్యాండిల్ మార్చ్‌ను నిర్వహించింది. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ దీక్షలో పాల్గొంది.

వైద్యురాలి కేసులో పురోగతి 

వైద్యురాలి కేసులో సీబీఐ మంగళవారం షిల్దాహ్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. వచ్చే నెల 4వ తేదీ నుంచి న్యాయస్థానం ఈ కేసుపై విచారణ చేపట్టనున్నది. కోర్టు ఈ కేసును వారంలో ౪ రోజుల పాటు కెమెరాల సమక్షంలో విచారణ సాగనున్నది. సంజయ్ ఇప్పటికే కేసులో తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి న్యాయస్థానాన్ని అభ్యర్థించా డు.

దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘కేసు ట్రయల్స్ జరుగుతున్నప్పుడు లాయర్ ద్వారా వినిపించండి’ అని సూచించారు. మరోవైపు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వైద్యురాలి నుంచి సేక రించిన డీఎన్‌ఏ నమూనాలు సంజయ్‌రా య్ డీఎన్‌ఏ ఒక్కటేనని సీబీఐ తేల్చినట్లు సమాచారం.

నిందితుడి దుస్తులు, బూట్లపైనా మృతురాలి రక్తపు మరకలు ఉన్నట్లు సమాచారం.  సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీ, హత్యాచారం జరిగినప్పుడు నిందితుడి మొబైల్ లోకేషన్ ఆసుపత్రిలోనే చూపించడం వంటి మొత్తం 11 కీలక ఆధారాలను సీబీఐ సేకరించినట్లు తెలిసింది.