calender_icon.png 28 October, 2024 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువుల మెడపై ‘రాజీనామా’ కత్తి

28-10-2024 12:00:00 AM

  1. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న వివక్షత
  2. హిందూ యువకులపై ‘లవ్ ట్రాప్’ ఆరోపణలు
  3. దాడుల కట్టడిలో ప్రభుత్వ విఫలం

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: బంగ్లాదేశ్‌లో షేక్ హసీన ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అక్కడ పరిస్థితులు భయానకంగా మారాయి. ము ఖ్యంగా బంగ్లాలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న వివక్షతో కూడిన దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

ఈ క్రమం లో తాజాగా అక్కడి హిందువులు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలకు రాజీ నామా చేయాలంటూ ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న హిందువులపై ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రాజీనామా చేయడానికి నిరాకరిస్తే సదరు ఉద్యోగిని రకరకాల కారణాలతో ఉద్యోగాల నుంచి బలవంతంగా తొలగిస్తున్నారు.

అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తు న్న హిందువులపై ఇటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ విద్యా రంగంలో పని చేస్తున్న ఉద్యోగులపై ఈ ఒత్తిళ్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. తాజాగా చిట్టగాంగ యూనివర్సిటీలోని హిస్టరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రొంతుదాస్ అనే ఉద్యోగి పై అధికారుల ఒత్తిళ్ల వల్ల బలవంతంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా సదరు ప్రొఫె సెర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేయకుంటే ప్రాణాలు పోతాయని బెదిరించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా శారదా పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుని షేక్ హసీన ప్రభుత్వ హయాంలో అపాయిట్‌మెంట్ పొందిన 252 మంది సబ్ ఇన్స్‌పెక్టర్‌లను క్రమశిక్షణారాహిత్యం సాకుతో నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించారు.

ఉద్యోగాలు కోల్పోయిన 252 మందిలో 91 మంది హిందువులే ఉన్నారు. సరైన కారణం లేకుండా ఉద్యోగం కోల్పోయిన ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 

‘లవ్ ట్రాప్’ పేరుతో 

ఒకవైపు ఉద్యోగాల్లో హిందువులపై వివక్ష కొనసాగుతుండగా మరోవైపు ‘లవ్ ట్రాప్’ పేరుతో హిందూ ప్రజలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడుస్తోంది. ప్రేమ పేరుతో హిందువులు మత మార్పిడులకు పాల్పడుతున్నారని దేశ వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది.

అమాయక ముస్లిం మహిళలను ప్రేమ పేరుతో హిందూ మతంలోకి మారే విధంగా ఒత్తిళ్లు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీన్నంతటినీ కొందరు మత ప్రచారకులు ముందుండి నడుపుతున్నారని అబాండాలు మోపుతున్నారు. 

హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం

దేవీ నవరాత్రుల సమయంలో కొందరు బంగ్లా ఆందోళనకారులు అనేక దారుణాలకు పాల్పడారు. దేవతామూర్తి విగ్రహాలను ధ్వంసం చేశారు. షేక్ హసీనా తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మహ్మద్ యూనస్ ఆందోళన కారులను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లోని హిందువులు తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా శుక్రవారం రోజు భారీ ర్యాలీ తీశారు. మైనార్టీల రక్షణ కోసం చట్టాలని తేవడంతోపాటు మైనారిటీ మంత్రిత్వశాఖను ఏర్పాటుతో పాటు మరో 6 డిమాండ్లను హిం దువులు ప్రభుత్వం ముందు ఉంచారు. తక్షణమే చర్యలు తీసుకుని నివసించేందుకు ప్రశా ంత వాతావరణాన్ని కల్పించాలన్నారు.