ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): దమ్ముంటే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎన్నికల్లో పోటీ చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏవిధంగా విమర్శలు చేశారో గుర్తు చేసుకోవాలని, ‘దానం పంజాగుట్ట చౌరస్తాలో బీడీలు అమ్ముకునే వాడు’ అని రేవంత్ విమర్శించిన సంగతి మరిచిపోవద్దని గుర్తుచేశారు. బీడీలు అమ్ముకునే దానం ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలని డి మాండ్ చేశారు. కేటీఆర్‌పై దానం చేసి వ్యా ఖ్యలను ఖండిస్తున్నామని, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ తనకు అ న్యాయం చేసిందని పలుమార్లు ఆరోపించి, కేసీఆర్ దయతో గెలిచానని గతంలో చెప్పిన మాటలు గుర్తుకులే వా అని నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను వేధించడంలో దానంకు మించిన వాడులేడని, త్వరలో ఆక్రమణలు, అక్రమాలు బయటపెడుతామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న ఎమ్మెల్యేలకు ఎన్నికోట్లు ఇస్తున్నారని ఆ పార్టీని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడినంత మాత్రాన బీఆర్‌ఎస్ పడిపోదని, యువ నాయకులను తయా రుచేస్తామని పేర్కొన్నారు.