calender_icon.png 23 April, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉడతానేని గుంపులో సిపిఎం బృందం పర్యటన

23-04-2025 09:10:04 AM

మంచినీళ్లు, కరెంటు కష్టాలతో కట్టు మల్లారం కేసీఆర్ కాలనీ వాసులు 

సత్రపల్లి సాంబశివరావు 

మణుగూరు( విజయక్రాంతి): మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం, కట్టు మల్లారం గ్రామపంచాయతీలలోని ఉడతానేని  గుంపు. కెసిఆర్ నగర్ కాలనీలో ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారని, విద్యుత్ సమస్యతో ఇబ్బందుల పాలవుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సిపిఎం బృందం ఇంటింటి సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఆ రెండు గ్రామపంచాయతీలో పుడుతనేని గుంపులో 180 కుటుంబాలు ఉండగా  సాయంత్రం 6 దాటితే చీకటి మయం అని,  మంచినీరు  సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

స్థానిక పంచాయతీ సెక్రెటరీ, ఎంపీడీవో  ఆ గ్రామంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. సైడ్ డ్రైనేజీలు  ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయన్నారు. కట్టు మల్లారం కేసీఆర్ కాలనీలో ఉన్నటువంటి పేదలకు పక్కా గృహాలు లేక గుడిసెలలో  జీవనం సాగిస్తున్నారన్నారని,  కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలలో  ఏ ఒక్కటి ఈ గ్రామాలకు దరి చేరటం లేదన్నారు. ఇప్పటికైనా ఆ గ్రామ లా  ప్రజల ఎదుర్కొంటున్న  కరెంటు, తాగునీరు, ఇందిరమ్మ గృహాలు తక్షణమే మంజూరు చేయాలని, లేని పక్షంలో  సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు  పెద్ద ఎత్తున ఆందోళన  చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కొడిశాల రాములు . మైనారపు నాగేశ్వరరావు  పద్మ తదితరులు కొంతమంది పాల్గొన్నారు .