calender_icon.png 17 January, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో కేసముద్రం మండల వాసుల దుర్మరణం

16-01-2025 11:59:38 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): యాద్రాద్రి భువనగిరి జిల్లా వరంగల్ హైదారాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం లచ్చిరామ్ తండాకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వివరాల్లోకి వెళ్తే కేసముద్రం మండలం లచ్చిరామ్ తండాకు చెందిన అనూషతో ఇదే మండలం గాంధీనగర్ శివారు వెంకట్రామ్‌తండాకు చెందిన భూక్య సంతోష్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రవశ్విని, చైత్ర అనే ఇద్దరు కూతుళ్లు జన్మించారు. సంతోష్ అనూష దంపతులు హైదరాబాద్ లో ఓ ప్రవేటు జాబ్ చేస్తూండగా సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన సంతోష్ అనూష, ప్రవశ్విని, చైత్ర తమ కారులో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

సంతోష్ బావ బేరువాడకు చెందిన గుగులోతు రవి అతని భార్య భవాని, కూతూరు మోక్షను కూడ వెంట తీసుకెళ్లారు. ఈ క్రమంలో రయగిరి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న సంతోష్ భార్య అనూష (27) కూతూరు చైత్ర (10) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సంతోష్‌తోపాటు అతని సోదరి భవానికి తీవ్ర గాయాలు కాగా సంతోష్ కుమార్తె ప్రవశ్విని, భావ రవికి స్వల్ప గాయాలు అయ్యాయి. లారీ వెనుక భాగములో కారు కూరుకుపోవడంతో స్థానికుల సహాకారంతో పోలీసులు డెడ్ బాడీలను బయటకు తీయాల్సి వచ్చింది. సంక్రాతి పండుగకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఇద్దరు ప్రాణాలు కోల్పవడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.