calender_icon.png 23 January, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలి

04-09-2024 03:03:13 PM

 మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడానికి సిద్ధమైన యంత్రాంగం

మీడియా మిత్రులు కూడా సహకరించాలి

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్, విజయక్రాంతి: మానేరు ఎగువ పరివాహక ప్రాంతంతో పాటు ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కరీంనగర్ మానేరు డ్యాం గేట్లు ఏ క్షణమైనా ఎత్తడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, మానేరుడ్యాం దిగువ ఉన్న గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం వీణవంకలోని ఆయన స్వగ్రామం నుంచి గత ఐదు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. డ్యాం దిగువ ఉన్న గ్రామాలలో సంబంధిత అధికారులు దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.

నది పరివాహక ప్రాంతంలో పశువులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతులు కూడా వ్యవసాయ భూముల వద్దకు వెళ్లకుండా ఉంటే బాగుంటుందన్నారు. దిగువ ప్రాంతంలో ఉండే గ్రామాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అలాగే మీడియా మిత్రులు కూడా ప్రజలకు సమాచారం అన్ని విధాల సిద్ధంగా ఉండాలని కోరారు. అలాగే హుజురాబాద్ నియోజకవర్గం లోని హుజురాబాద్ పట్టణంలోని 17 వ వార్డ్ ,బుడగ జంగాల కాలనీ, జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, వీణవంకలోని కనపర్తి గ్రామం ప్రజలు వర్షాలతో చాలా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హుజరాబాద్, జమ్మికుంట మున్సిపల్ అధికారులు రెండు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా జలాశయ దిగువ ఉన్న ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారులు వారికి సూచన చేస్తూ ఎలాంటి హాని జరగకుండా చూడాలని అని అన్నారు