calender_icon.png 18 March, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌతమి స్వర్ణనంది అవార్డులు అందుకున్న ఇల్లెందు వాసులు

17-03-2025 07:32:50 PM

ఇల్లెందు (విజయక్రాంతి): విశ్వవిఖ్యాత ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ, కే ఎన్ డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి హైదరాబాదులోని త్యాగరాయ గాన సభ మెయిన్ హాల్ చిక్కడపల్లిలో ఉగాది పురస్కారాలు 2025లో భాగంగా తమ తమ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు జాతీయస్థాయి గౌతమి నంది అవార్డును ఇల్లందువాసులు శివశక్తి దండ సారయ్య (సారిక), డాన్స్ మాస్టర్ కడారి వెంకటేష్, లాయర్ కీర్తి కార్తిక్ లకు నిర్వాహకులు అందజేశారు.

ఈ సందర్భంగా అవార్డును అందుకున్న ఇల్లందు వాసులు దండు సారయ్య (సారయ్య), కడారి వెంకటేష్, కీర్తి కార్తిక్ మాట్లాడుతూ... తాము చేసిన సేవలను గుర్తించి గౌతమీ స్వర్ణ నంది అవార్డును అందించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దైవజ్ఞ శర్మ, కేఎన్ డి సంస్థ అధ్యక్షులు కోటేశ్వరమ్మ, కార్యదర్శి ఎస్.వి.ఆర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.