03-03-2025 07:33:14 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని 24 డిప్ ఏరియాలోని 16వ వార్డులో బాలగణపతి మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బస్తీ వాసులు, మహిళలు మాజీ కౌన్సిలర్ ఎలిగేటి సుజాత శ్రీనివాస్ దంపతులను సోమవారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్ గా పనిచేసిన కాలంలో బస్తీ సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల కష్టసుఖాల్లో కలసికట్టుగా పాలు పంచుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బైరి శంకర్, సబ్బని రాజనర్సు, పొడిసెట్టి ప్రభాకర్, కట్కూరి రాజేందర్, కట్కూరి శంకర్, పోసర్తి మల్లికార్జున్, గోనెల మధుసూదన్, ఆరుముళ్ళ కృష్ణ, ఎలిగేటి లక్ష్మీనారాయణ శ్రీలత, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.