calender_icon.png 21 April, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నివాసపు రేకుల షెడ్డు దగ్ధం

21-04-2025 05:20:11 PM

నిరాశురాలైన కుటుంబం 

రెండు లక్షల నగదు, బంగారం, వెండి, గేదె 20 కోళ్ళు బూడిద పాలు

జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని గుండూరు గ్రామంలో ఆదివారం రాత్రి సుమారు రెండు గంటల సమయంలో విద్యుత్ షాక్ తో నివాసపు రేకుల షెడ్డు దగ్ధమైనట్లు బాధితురాలు సుమిత్ర బాయి తెలిపారు. ఇందులో రూ.2 లక్షల నగదు తో పాటు ఒక గేదె, 20 కోళ్ళు, తులం బంగారం, పది తులాల వెండి, కాలి బూడిదయినాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోమవారం రెవెన్యూ అధికారులకు తెలుపగా ఆర్ఐ రాం పటేల్ సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున వచ్చే డబ్బులను అందే విధంగా కృషి చేస్తామని తాసిల్దార్ మహేశ్వరి పేర్కొన్నారు.

ఇట్టి విషయాన్నిపై స్థాయి అధికారులకు నివేదిక పంపించామని తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండలుగా వచ్చి కుటుంబీకులను చూసి కన్నీరు మున్నీరయ్యారు. అసలే పేద కుటుంబంపైగా డబ్బులు చేతికి అందకుండా పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవారికి గ్రామస్తులతో పాటు ప్రజాప్రతినిధులు ఆమెకు ఓదార్చారు. గ్రామ మాజీ సర్పంచ్ దేవిదాస్, మాజీ ఎంపీపీ బసవంతరావు శెట్కార్ తదితరులు కుటుంబీకులను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.