01-03-2025 09:03:09 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మహిళ నివాస గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రూప అనే మహిళ శ్రీ శబరిమాత ఆశ్రమం నందు చిన్న దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె గ్రామంలోని ఒక గుడిసెలో నివాసం ఉంటుంది. మధ్యాహ్నం ఓక్కసారిగా నిప్పు రవ్వలు వచ్చి గుడిసె పై పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది ప్రమాదంలో బియ్యం వంటసామాగ్రి బట్టలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.25 వేల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు బాదిత మహిళలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు