calender_icon.png 30 January, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్ రద్దు

30-01-2025 01:54:10 AM

ఆ విధానం రాజ్యాంగ విరుద్ధం : సుప్రీం

న్యూఢిల్లీ, జనవరి 29: వైద్య విద్య లో నివాస ఆధారిత రిజర్వేషన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ రిజర్వేషన్ విధానం ద్వారా పీజీ మెడికల్ కోర్సులలో సీట్లను కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసిం ది. మెరిట్ ఆధారంగానే పీజీ కోర్సు ల్లో అడ్మిషన్లు జరగాలని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

అయితే రాష్ట్రాలు ఇప్పటికే మంజూరు చేసిన నివాస ఆ ధారిత రిజర్వేషన్లపై ఈ తీర్పు ఎలాం టి ప్రభావం చూపదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘మనమంతా భారత భూభాగంలోనే నివసి స్తున్నాం. ఏ రాష్ట్రం, ఏ ప్రావిన్స్ నివా సం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఉద్యోగం, వ్యాపా రం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉం డే హక్కు ఉంది. అలాగే చదువుకునే హక్కు కూడా ఉంది.

నివాస ఆధారిత రిజర్వేషన్ అమలు చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్టు అవుతుంది’ అని  పేర్కొం ది. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్ కోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయగా ఇద్దరు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది.