calender_icon.png 16 January, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలాశయాలు.. జల సవ్వళ్లు !

25-08-2024 02:54:39 AM

  1. ‘సాగర్’ నుంచి 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ 
  2. కడెం, తాలిపేరు ప్రాజెక్ట్ నుంచీ జలాల విడుదల

నిర్మల్/ నల్లగొండ, ఆగస్టు 24 (విజయక్రాంతి), చర్ల: ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు మళ్లీ జలకళను సంతరించుకుంటున్నాయి. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి శనివారం భారీగా వరద వచ్చి చేరింది.  ప్రాజెక్ట్ అధికారులు 25 గేట్లు ఎత్తి  61,570 క్యూసెకుల నీటిని దిగువకు వదిలారు. అయినప్పటికీ 57,254 క్యూసెక్కుల వరద మళ్లీ ప్రాజెక్టులో చేరుతోంది. అలాగే గోదావరి బేషిన్‌లోని నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ 6,733  క్యూసెక్యుల వరద వచ్చి చేరింది.

దీంతో ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు ఎత్తి 4,948 క్యూసెక్యుల జలాలను కడెం వాగులోకి వదిలారు. స్వర్ణ ప్రాజెకులోకి 1,500 క్యూసెక్యుల వరద చేరుతుండగా, అంతే మొత్తంలో ఒక గేటు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. గడ్డెన్న వాగు పూర్తిస్థాయి నీటిమట్టం 358 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 357.80 అడుగులకు చేరింది. అలాగే కృష్ణా బేసిన్ నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. 400 అడుగుల పైనుంచి 26 క్రస్టుగేట్ల ద్వారా జలాలు కిందికి వస్తుండడంతో.. ఆ దృశ్యాన్ని పాలధారను తలపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నది.