calender_icon.png 11 March, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

10-03-2025 08:39:34 PM

మునగాల: తెలంగాణలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఎం.ఎస్.పి. శ్రీను అధ్యక్షతన డప్పుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రిజర్వేషన్ల వర్గీకరణపై ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీం అక్తర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి శాస్త్రీయంగా అధ్యయనం చేసి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాల వద్ద డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎం.ఎస్.పి. సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, కొత్తపల్లి అంజయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీలను  ఏబీసి కాకుండా ఎబిసిడి లుగా 4 గ్రూపులుగా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా  వర్గీకరించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే లకు మంత్రి పదవులు కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్దల అశోక్ మేరీగ వెంకటేశ్వర్లు, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు మేరీగ ముత్తయ్య, గంట బాబు, జగదీష్, గణేష్, సాయికుమార్, శివ, కృష్ణ, ఉపేందర్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.