calender_icon.png 12 January, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి

01-12-2024 12:38:04 AM

  1. డెడికేటెడ్ కమిషన్‌కు పద్మశాలీ నేతల విజ్ఞప్తి 
  2. రేపు సంగారెడ్డిలో బహిరంగ విచారణ

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే పలు ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టింది. అయితే ఈ ఎన్నికల్లో బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వలకటి రాజకుమార్ కోరారు.

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావును రాష్ట్ర పద్మశాలీ సంఘం సభ్యులు శనివారం కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి బడుగు సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలౌక్‌కుమార్, పద్మశాలీ సంఘం నాయకులు గుంటి నరేశ్, గంజి శ్రీనివాస్, మేకల జయరాములు, బింగి నవీన్‌కుమార్, మామిడాల సంపత్, మేకల నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

సంగారెడ్డి కలెక్టరేట్‌లో.. 

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారు పాల్గొని వినతులు సమర్పించాలని సూచించింది. సోమవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బహిరంగ విచారణ ఉంటుందని, వినతులు నేరుగా చైర్మన్‌కు అందజేయవచ్చని కమిషన్ ప్రకటనలో తెలిపింది.