calender_icon.png 20 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి

13-04-2025 01:50:54 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని, రాహుల్‌గాంధీ చెప్పిన తర్వాతే.. దేశవ్యాప్తంగా కులగణన అంశం చర్చకు వచ్చిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. ప్రేవేట్ సెక్టార్‌లోనూ రిజర్వేషన్లు ఇ వ్వాలని  రాహుల్‌గాంధీ కోరుతున్నారని తెలిపారు.

శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గడంతో పాటు ఉద్యోగాలూ తగ్గుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగుతుందన్నారు. తెలంగా ణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన కులగణన దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణలోనూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.