రాష్ట్ర బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర్‌రావు
సంగారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసిందని రాష్ట్ర బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ సంఘాలు, కులసంఘాల నుంచి కమిటీ అభిప్రాయలు సేకరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని వెంకటేశ్వర్‌రావు తెలిపారు. కుల సంఘాలు, స్వచ్ఛంద సంఘాలకు చెందిన నాయకుల నుంచి కమిటీకి 24 వినతిపత్రాలు అందాయి. ఆయా వినతులను ప్రభుత్వానికి అందజేస్తామని వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి బీ సైదులు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆర్ రమేశ్, జగదీశ్, అధికారులు షేక్ ఆహ్మద్, అఖిలేష్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.