21-04-2025 06:56:24 PM
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని కలకోవలో సమాజంలో అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి పంచాయతీ మున్సిపాలిటీలో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ తమిళనాడు అసెంబ్లీలో చట్టం చేసిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమిస్తున్న వికలాంగులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజా పాలన అంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమిళనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నెరవేరుస్తూ ప్రజాస్వామ్య పాలన సాగిస్తూ రాజకీయాల్లో వికలాంగుల ఆత్మగౌరభాన్ని పెంపొందించేలా పంచాయతీ మున్సిపల్ లో ఎన్నికలు వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి.