calender_icon.png 16 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి

08-08-2024 01:45:40 AM

  1. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు 
  2. బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు 

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. ‘నారీ న్యాయ్ హక్కు’ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని ఏఐసీసీ సూచించగా.. బుధవారం రాష్ట్రంలోనూ మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో నిరసన వ్యక్తంచేశారు. వందలాది కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు.. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి య త్నించారు.

పోలీసులు గాంధీభవన్ గేటు వద్దే వీరిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సునీతారా వు మాట్లాడుతూ.. నారీ న్యాయ్ హక్కు సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ, తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.