ఆదిలాబాద్,(విజయక్రాంతి): చట్టసభల్లో మహిళలకు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర భారత జాతీయ మహిళా సమాఖ్య దేనిని సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళిని రెడ్డి పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈనెల 23,24వ తేదీల్లో హైదరాబాద్ లో మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభ జయప్రదం చేయాలని కోరుతూ అదిలాబాద్ జిల్లా సీపీఐ కార్యాలయంలో బుధవారం మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నళిని రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
మహిళాల సమస్యలపై చేపట్టిన అనేక పోరాటం ద్వారా ప్రభుత్వాలు తలవంచి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ అది నేటి వరకు అమలుకు నోచుకోవడంలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో మహిళలని అనుగదొక్కటానికి, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఇలా మహిళలపై ఉక్కు పాదం మోపడం హిందుత్వమా అని నళిని రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.