calender_icon.png 23 October, 2024 | 4:59 PM

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

04-08-2024 02:24:15 AM

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర కులగణన జరిపి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.  బీసీ జనసభ, బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 10న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న బీసీ సత్యాగ్రహ దీక్షకు సంబంధించి వాల్‌పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్‌కు అనుగుణంగా సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్, బీసీ మహాసభ అధ్యక్షుడు సిద్ధ్దేశ్వరులు, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు పిడికిలి రాజు, ఆల్ ఇండి యా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, టి.జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.