calender_icon.png 23 December, 2024 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీల రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి

23-12-2024 02:14:44 AM

సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మోతీలాల్

ముషీరాబాద్, డిసెంబర్ 22 : (విజయక్రాంతి): ఎస్టీల 10 శాతం రిజర్వేషన్‌ను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చేలా.. రాష్ట్ర ప్రభుత్వం వొత్తిడి తీసుకురావాలని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్, జాతీయ అధ్యక్షుడు గాంధీనాయక్ కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం 10 వార్షికోత్సవ మహాసభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. బంజారా భాష (గోర్‌బోలి)ను 8వ షెడ్యూల్‌లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిధులు మంజూరు చేయాలని అన్నారు.