calender_icon.png 23 February, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12% ఉన్న ముస్లింలకు 24% రిజర్వేషన్‌లా?

18-02-2025 01:38:35 AM

మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో 12 శాతం ఉన్న ముస్లింలకు 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, 50 శాతానికిపైగా ఉ న్న బీసీలను మాత్రం తగ్గించి చూ పిస్తూ రాజకీయంగా దెబ్బకొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.

కాంగ్రెస్ సర్కారు చేపట్టింది కులగణన కాదని, ఇది రాజకీ య గణన అని విమర్శించారు. ము స్లింలను బీసీలుగా చేసేలా కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న పద్మశాలీలు కేవలం 10 లక్షలు, మున్నూరు కాపులు 12 లక్షలు మాత్రమే ఉన్నట్టు కులగణనలో చూపిస్తూ బీసీలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.