calender_icon.png 24 November, 2024 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంఫై తహశీల్దార్ ఆగ్రహం

23-11-2024 10:48:43 PM

నడిగూడెం (విజయక్రాంతి): మండల కేంద్రంలోనీ బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడం, విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడంపై తాహసిల్దార్ సరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి తహసిల్దార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు అందించే భోజనాన్ని తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు స్టోర్, గదిని, టాయిలెట్స్  పరిశీలించారు.

తనిఖీ  సమయంలో హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులకు అందిస్తున్న మెనూ వివరాలను వర్కర్లను  అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉపయోగించే బాత్రూములలో లైట్స్ లేకపోవడంపై విద్యార్థులకు వండిన వంటకాలు సరిపోకపోవడంతో హాస్టల్ నిర్వహణపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో 112 మంది విద్యార్థులకు గాను 78 మంది మాత్రమే ఉన్నారు. తనిఖీ సమయంలో వార్డెన్ గైరాజర్ పై, భోజనం తక్కువైన విషయంపై హాస్టల్లో నెలకొన్న పలు సమస్యలపై  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని  ఆమె తెలిపారు. వారి వెంట ఆర్ఐ గోపాల్ కృష్ణ ఉన్నారు.