జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం
కూకట్ పల్లి, జనవరి 31 (విజయక్రాంతి): రీసెర్చ్ మెథడాలజీ తరగతులను ఉదయం 10 గంటల నుండి ఐదు గంటలకు కాకుండా మధ్యాహ్నం రెండు గంటల నుండి ఏడు గంటల వరకు నిర్వహించాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావుకి జేఎన్టీయూ హెచ్ ప్రొటెక్షన్ ఫోర్స్, జేఎన్టీయూహెచ్ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం విద్యార్థులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థి, జేఎన్టీయూ హెచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు భరత్ కుమార్ మాట్లాడుతూ జేఎన్టీయూహెచ్ విశ్వవిద్యాలయ పరిధిలో సోమవారం నుండి రీసెర్చ్ మెథడాలజీ తరగతులు ప్రారంభం అవుతాయని అన్నారు.
విశ్వ విద్యాలయ పరిధిలో అధికంగా పార్ట్ టైం పిహెచ్డి స్కాలర్లే ఉన్నారని, వారికి రీసెర్చ్ మెథడాలజీ తరగతులు అత్యంత ప్రాధా న్యతను ఇస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు జవ్వాజి, దిలీప్, జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు రాహుల్ నాయక్, అనిష్ కుమార్, సోహన్ తదితరులు పాల్గొన్నారు.