23-02-2025 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాం తి): జీనిట్స్ (జీ నారాయణమ్మ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)లో మొదటి పరిశోధన, ఆవిష్కరణ దినోత్సవాన్ని శనివారం ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ప్రారంభించి, మాట్లాడారు. ఉన్నత విద్యలో నవ్య త, పరిశోధన ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, యువత ఎంట్రెప్రినేటర్లుగా మారాలని వివరించారు.
ఉత్సవంలో భాగం గా భవిష్యత్ దిశగా క్వాంటం కంప్యూటింగ్, స్థి రమైన ఆవిష్కరణలు అనే అంశంపై జాతీయ సింపోజియం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమల నిపుణులు మాట్లాడా రు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.వి.సుబ్రహ్మణ్యం, ఐబీఎం ప్రధా న డేటా శాస్త్రవేత్త శశాంక వాలేటి, మ్యాన్‌కీ ఎలక్ట్రానిక్స్ సీఈవో త్రిభువన్ డీ, ప్రొఫెసర్ మురళీకృష్ణ అయ్యంకి, ఏఎస్‌సీఐ ప్రొఫెసర్, ఎనర్జీ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ డా. రాజకిరణ్ వి బిలోలికర్, నిమ్స్ ఎంఈ డా. ముత్యాల శరత్, విండ్ స్ట్రీమ్ టెక్నాలజీస్ వెంకటకుమార్ తంగిరాల, ఏఐసీజీ నిట్స్ సీఈవో డా.శాశ్వత్ పాఠక్ తమ అనుభవాలను పంచుకున్నారు.
హైదరాబాద్‌లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 400కు పైగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జి శ్రీవిద్యారెడ్డి (ఉపాధ్యక్షురాలు), ప్రిన్సిపాల్ డా. కె.రమేశ్‌రెడ్డి, డీన్ ఆర్, డీ డా.ఎం.సీత, డీన్ ఐ, ఐ డా.ఎన్.కళ్యాణి పురస్కార విజేతలను అభినందించారు. డా.స్వప్న రఘునాథ్, డా. బి.శశిధర్, డా.ఈ.గౌతమీ అధ్యక్షతన కార్యక్రమం కొనసాగింది.